విజయవాడలోని భవానిపురం సితార సెంటర్ వద్ద ఇద్దరు తాగుబోతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసముండే పూర్ణారెడ్డి, విద్యాధరపురానికి చెందిన లారీ డ్రైవర్ ఈశ్వర రెడ్డికి గొడవ జరిగింది. ఈ క్రమంలో పూర్ణారెడ్డి పై ఈశ్వర రెడ్డి కత్తితో దాడి చేశాడు. దీంతో అతనికి మెడపై బలమైన గాయం అయ్యింది. స్థానికుల సాయంతో క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఇద్దరి తాగుబోతుల మధ్య కత్తులతో ఘర్షణ... గాయపడిన వ్యక్తి - news of fight between two people
ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు గాయపడ్డారు. విజయవాడలోని భవానిపురం పోలీస్స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది.
భవానిపురం పోలీస్స్టేషన్ పరిధిలో వ్యక్తుల మధ్య ఘర్షణ