ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబుతో సమావేశమైన జడ శ్రావణ్‌కుమార్‌ - చంద్రబాబును కలిసిన జడ శ్రావణ్‌కుమార్‌

A non political United Action Committee: వైకాపా ప్రభుత్వ అరాచకాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న తెదేపాతో కలసి పనిచేస్తామని.. జై భీమ్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ ప్రకటించారు. ఇందుకోసం రాజకీయేతర ఐక్యకార్యచరణ సమితిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. తెదేపా అధినేత చంద్రబాబుతో ఎన్టీఆర్ భవన్‌లో శ్రావణ్‌కుమార్‌ సమావేశమయ్యారు.

Ntr Bhavan
ఎన్టీర్ భవన్‌

By

Published : Oct 22, 2022, 1:04 PM IST

A non political United Action Committee: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఎన్టీర్ భవన్‌లో జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ అరాచకాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయని.. భేటీ అనంతరం శ్రావణ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక విధానలపై గొంతెత్తిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని జై భీమ్ పార్టీ అధినేత అన్నారు. ఈ అరాచకాలను అణచివేసేందుకు చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు కలసి పనిచేస్తామని వెల్లడించారు. ఇందుకోసం రాజకీయయేతర వేదికన ఏర్పాటు చేయనున్నట్లు శ్రవణ్ కుమార్ చెప్పారు.

ఎన్టీర్ భవన్‌

ABOUT THE AUTHOR

...view details