ఓ చిన్న ప్రశ్న వ్యక్తి ప్రాణాన్ని తీసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన లక్ష్మయ్య ద్విచక్రవాహనాన్ని... అతని సోదరుడి కొడుకు దుర్గాప్రసాద్ మద్యం తాగేందుకు తీసుకెళ్లాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో మద్యం దుకాణం వద్దకు వచ్చిన లక్ష్మయ్య... బైక్ ఎందుకు వేసుకొచ్చావంటూ ప్రశ్నించాడు. ఆగ్రహించిన దుర్గాప్రసాద్ రాయితో అతనిపై దాడిచేశాడు. లక్ష్మయ్య తల వెనుక భాగాన గాయమైంది. క్షతగాత్రున్ని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా... మార్గమధ్యలో లక్ష్మయ్య చనిపోయాడు.
చిన్న ప్రశ్న... ప్రాణం తీసింది..! - కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో వ్యక్తి హత్య వార్తలు
ఓ చిన్న ప్రశ్న వ్యక్తి ప్రాణాన్ని తీసింది. బైకు ఎందుకు వేసుకొచ్చావంటూ ప్రశ్నించినందుకే... రాయితో కొట్టి చంపాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది.
మృతుడు లక్ష్మయ్య
TAGGED:
మచిలీపట్టణంలో నేర వార్తలు