ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాతి వేరైనా.. అమ్మ ప్రేమ ఒక్కటే.. - monkey news in mahabubabad district

సృష్టిలో అమ్మ ప్రేమకు మించింది మరొకటి లేదు. పిల్లలపై తల్లులు చూపే ప్రేమానురాగాలు ఒకే విధంగా ఉంటాయి. ఇదే ప్రేమానురాగాలను పంచడంలో తామేమీ తక్కువ కాదంటున్నాయి జంతువులు, పశుపక్ష్యాదులు. పిల్లి పిల్లను ఓ వానరం తన సొంతబిడ్డలా గుండెకు హత్తుకుని అనునిత్యం ప్రేమాభిమానాలు పంచుతూ అందరినీ ఆశ్చర్యపరచిని సంఘటన మెహబూబాబద్​ జిల్లాలో జరిగింది.

monkey news in mahabubabad district
మహబూబాబాద్​ జిల్లాలో కోతి

By

Published : Sep 13, 2020, 9:31 AM IST

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రంలో వానరాల సంచారం అధికంగా ఉంది. వానర సమూహం గ్రామంలో సంచరిస్తూ నానా హంగామా సృష్టిస్తుంటాయి. ఈ క్రమంలో గత రెండు రోజుల క్రతం ఓ వానరానికి పిల్లి కూన కనిపించింది. ఆ కోతి.. పిల్లి కూనను తన బిడ్డగా బావించి దానిని ఎత్తుకుని తిరుగుతోంది. తన చంక దింపకుండా తల్లిప్రేమను అందిస్తోంది.

వానరం కొంత సేపు పిల్లి కూనను వదిలిపెట్టడం... క్షణాల్లో దాన్ని తిరిగి చేతుల్లోకి తీసుకోవడం, గుండెకు హత్తుకుని బిడ్డలా చూసుకుంటున్న తీరును గ్రామస్థులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇలాంటి వింత ప్రేమను తామెప్పుడూ చూడలేదని గ్రామస్థులు చెబుతున్నారు. జాతి వైరాన్ని విస్మరించి పిల్లి పిల్లపై వానరం చూపే తల్లిప్రేమ చూసేవారిని ఆలోచింపజేస్తుంది.

ఇదీ చదవండి:రాష్ట్రంలో 3 లక్షల రెమిడెసివిర్‌ ఇంజెక్షన్ల విక్రయం

ABOUT THE AUTHOR

...view details