SLBC Meeting : తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. బ్యాంకర్లు, ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయ సంఘాల్లో ఒక్క ఎన్ పీఏ కూడా నమోదు కాలేదని, అయినా బ్యాంకర్లు వారి వద్ద నుంచి అధికవడ్డీలు వేయటం సరికాదని ముఖ్యమంత్రి జగన్ బ్యాంకర్ల కమిటీకి సూచించారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన ఎస్ఎల్ బీసీ సమావేశంలో సీఎం వివిధ అంశాలపై బ్యాంకర్లతో మాట్లాడారు. 9 నెలల కాలంలో కౌలు రైతులకు ఇవ్వాల్సిన రుణ లక్ష్యాలను చేరుకోలేదని సీఎం ఆక్షేపించారు. ఇప్పటి వరకు బ్యాంకర్లు 1126 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేయడం సరికాదన్నారు. కౌలు రైతులకు 9 నెలల కాలంలో రూ. 1,126 కోట్ల రుణం మాత్రమే ఇవ్వటం శోచనీయమని అసంతృప్తి వ్యక్తం చేశారు.
వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలపై సమీక్ష... తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 222 వ బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో రుణ ప్రణాళిక లక్ష్యాలపై సమీక్షించారు. కేవలం 9 నెలల్లోనే 124 శాతం లక్ష్యాలను చేరుకోవటం సంతోషదాయకం అని సీఎం జగన్ పేర్కొన్నారు. రుణ లక్ష్యాలు, మంజూరుపై ఆరా తీశారు. కౌలు రైతులకు 9 నెలల కాలంలో రూ. 1,126 కోట్ల రుణం మాత్రమే ఇవ్వటం శోచనీయమని అసంతృప్తి వ్యక్తం చేశారు.