ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

119 కోసం...80 వేలు పోగొట్టుకున్నాడు - 80 thousand

ఆన్​లైన్ మోసాలపై అవగాహన లేక చాలామంది ఆ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఎదుటివారి అవసరాన్ని సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. 119 రూపాయలను తిరిగి పొందేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించిగా అతని బ్యాంక్​ అకౌంట్​లోని 80 వేల రూపాయలు ఖాళీ అయ్యాయి.

cyber crime

By

Published : Oct 2, 2019, 4:30 PM IST

కృష్ణా జిల్లా కంకిపాడు మండలానికి చెందిన మస్తాన్​వలి అనే వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. బాధితుడు తన మొబైల్​లోని ఫోన్​పే యాప్ ద్వారా 119 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నాడు. కానీ అది విఫలమవ్వటంతో.. ఎందుకు రీఛార్జ్ కాలేదు అనే విషయంపై ఆరా తీసేందుకు ప్రయత్నించాడు. దీనిలో భాగంగా గూగుల్​లో ఫోన్​పే కస్టమర్ కేర్ గురించి వెతగ్గా అతనికి ఓ ఫోన్ నెంబర్ లభించింది. దానికి ఫోన్ చేయగా ఓ వ్యక్తి మాట్లాడాడు. "లింకు పంపుతాను దానిపై క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేస్తే మీ ఖాతాలోకి తిరిగి నగదు జమ అవుతుంది" అని నమ్మబలికాడు. నిజమే అనుకున్న మస్తాన్​వలి అపరిచిత వ్యక్తి చెప్పినట్లుగానే చేశాడు. వెంటనే అతని బ్యాంక్​ ఖాతాలోని రూ.10 వేలు, ఇదే మొబైల్ నెంబరుతో అనుసంధానమైన అతని భార్య బ్యాంక్​ ఖాతా నుంచి మరో 70 వేల నగదు మాయమయ్యాయి. విషయాన్ని గ్రహించిన బాధితుడు స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. వారు కేసు నమోదు చేసి విజయవాడ సైబర్ సెల్​కు బదిలీ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details