కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలోని పిన్నమనేని సిద్దార్థ ఆసుపత్రిలో దారుణం జరిగింది. అమ్మాయి పుట్టిందని 8 రోజుల పసికందును కన్న తండ్రే బేరానికి పెట్టాడు. నూజివీడు మండలం కొత్తూరు తండా సిద్దార్థనగర్కు చెందిన రాజేష్, రజిత నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. రజిత మొదటి కాన్పులో మగ బిడ్డ పుట్టాడు. మరోసారి గర్భం దాల్చిన ఆమె 8 రోజులు క్రితం రెండో కాన్పులో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరూ అమ్మాయిలే కావడం వల్ల రాజేష్ ఓ బిడ్డను అమ్మేందుకు నిర్ణయించుకుని... ఒకటిన్నర లక్షలకు బేరం పెట్టాడు. అయితే ఇది గమనించిన రాజేశ్ మామ అతనితో ఘర్షణ పడ్డాడు. మామ అల్లుళ్ల గొడవతో విషయం బయటకు వచ్చింది.
ఓ తండ్రి నిర్వాకం...అమ్మకానికి ఆడ'పసికందు' - కృష్ణా జిల్లా చిన్నఅవుటపల్లిలో ఆడపిల్లను అమ్మకానికి పెట్టిన తండ్రి
నాన్న... ఈ పిలుపంటే ఓ బాధ్యత. అలాంటి పిలుపునకు మచ్చ తెచ్చాడు ఓ ప్రబుద్ధుడు. తనకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని ఓ అమ్మాయిని అమ్మకానికి పెట్టాడు. ఎనిమిది రోజుల పసికందును లక్షన్నర రూపాయలకు అమ్మేందుకు సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకున్న అతని మామ ఎదురుతిరగడం వల్ల విషయం బయటకు వచ్చింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలో జరిగిన ఘటన వివరాలివీ...!
అమ్మకానికి ఆడపిల్ల