ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

THEFT VIRAL VIDEO: ఏమీ దొరక్క.. టిషర్ట్‌తోపాటు ద్విచక్రవాహనం ఎత్తుకెళ్లిన దొంగ - టిషర్ట్‌ దొంగ

THEFT VIRAL VIDEO: కృష్ణా జిల్లాలో ఓ దొంగ చోరీకి వెళ్లగా ఏమీ దొరక్కపోవడంతో సిల్లీగా టిషర్ట్​ ఎత్తుకెళ్లాడు. దీనికి తోడు ఇంటి ఆవరణలో ఉన్న ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

THEFT VIRAL VIDEO
THEFT VIRAL VIDEO

By

Published : Jan 2, 2022, 8:42 AM IST

Updated : Jan 2, 2022, 9:53 AM IST

ఏమీ దొరక్క.. టిషర్ట్‌తోపాటు ద్విచక్రవాహనం ఎత్తుకెళ్లిన దొంగ

THEFT VIRAL VIDEO: అందరూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే హడావుడిలో ఉండగా.. ఓ దొంగ మాత్రం చోరీకి వచ్చి ఏమి దొర‌క్కపోవడంతో టిషర్ట్‌ను ఎత్తుకుపోయిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. అవనిగడ్డలోని ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి ఎలాంటి వస్తువు కనబడకపోవడంతో.. దుండగుడు టిషర్ట్ వేసుకుని బైక్ తీసుకుని నాగాయలంకలో వదిలాడు. అక్కడ మరో ద్విచక్రవాహనాన్ని వేసుకుపోయాడని పోలీసులు తెలిపారు.

ఇటీవల దివిసీమ ప్రాంతంలోని యువత మత్తుకు అలవాటుపడి.. డబ్బుకోసం చోరీలు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. మొన్నటికి మొన్న అవనిగడ్డలో బాలుడిని కిడ్నాప్ చేయడం, పోలీసులు చాకచక్యంగా గంటల వ్యవధిలో దుండగుడిని పట్టుకున్న ఘటన చోటుచేసుకుంది. ఆ దుండగుడు కూడా వ్యసనాలకు బానిస అవ్వడమే కారణం అని భావిస్తున్నారు. యువత మత్తుకు బానిస అవకుండా పోలీసులు కూడా గట్టి నిఘా పెంచినట్లు అవనిగడ్డ సబ్ ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం దుండగుడు టిషర్ట్ వేసుకుపోయిన వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇదీ చదవండి:Polavaram Project News: పోలవరం సవరణ అంచనాల ఆమోదంలో జాప్యం

Last Updated : Jan 2, 2022, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details