ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

27న ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి - krishna district news

భట్లపెనుమర్రు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. గత డిసెంబర్ 27న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

a-man-suspicious-death-in-bhatlapenumarru
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

By

Published : Jan 10, 2021, 10:35 AM IST

కృష్ణా జిల్లా మెువ్వ మండలం భట్లపెనుమర్రు గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ వలీ గత ఏడాది డిసెంబర్ 27న పురుగుల మందు తాగాడు. బంధువులు వెంటనే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి ఈ నెల 6న గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

మృతుడు అడంగల్​లో పేరు నమోదు కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేక.. మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఆత్మహత్య విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది ఆగమేఘాల మీద అడంగల్​లో పేరు నమోదు చేసినట్టు ఆరోపించారు. కూచిపూడి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details