ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుదరవల్లి చేపల చెరువు వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి - కుదరవల్లిలో వ్యక్తి అనుమానస్పద మృతి

చేపల చెరువు వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన కుదరవల్లిలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

man death news in kudaravalli

By

Published : Oct 14, 2019, 8:26 PM IST

కృష్ణాజిల్లా నందివాడ మండలం కుదరవల్లిలో చేపల చెరువు వద్ద పనిచేస్తున్న పోనుగుమటి.సంసోను (22) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. గత నాలుగు రోజుల క్రితం ఆ చెరువుపై మేతకట్టలు దొంగతనం జరిగిందని గుమాస్తా వేణు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు జరుగుతుండగానే సంసొ మృతి కలకలం రేపింది. అనుమానంతో గుమస్తా, చెరువు యజమాని దాడి చేశారని అందుకే తన కుమారుడు చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. మృతునికి భార్య , రెండునెలల చిన్నారి ఉంది. అతని మరణం బాధిత కుటుంబంలో విషాదం మిగిల్చింది. ఈ ఘటన పై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుదరవల్లి చేపల చెరువు వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి

ABOUT THE AUTHOR

...view details