చేసిన అప్పుకు బాకీ తీర్చినా,ఇంకా వేదిస్తున్నారని ఆరోపిస్తూ..విజయవాడ రామవరప్పాడుకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు.గతంలో తాను చంద్రశేఖర్ అనే వ్యక్తి వద్ద అప్పు తీసుకుని బాకీ తీర్చినా,ఇంకా డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నాడని ప్రసాద్ ఆరోపించాడు.కేసు పెట్టిన పోలీసులు పట్టించుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశాడు.తనకు న్యాయం జరిగే వరకు కిందకు దినని భీష్మించాడు.పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకు దిగిన ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు.
రామవరప్పాడులో సెల్‌టవర్ ఎక్కి వ్యక్తి నిరసన.. - Man protests in Ramavarappadu cell tower
అప్పుల బాకీ కట్టిన తనని ఇంకా వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి సెల్‌టవర్ ఎక్కిన ఘటన రామవరప్పాడులో చోటుచేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, ఆందోళనకారుడిని అదుపులోకి తీసుకున్నారు.
ballemvari street ramavarappadu in krishna district