ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

' సీఎంను కలవాలని బయలుదేరాడు..మధ్యలోనే మిస్సయ్యాడు'

గ్రామంలో ప్రజలు కష్టపడుతుంటే తాను చూడలేక పోయాడు. విద్యార్థులు బస్సులేక ..పాఠశాలలకు వెళ్లలేక ఇంటికి బాధతో వచ్చినప్పుడు వారి ఆవేదనను అర్థం చేసుకున్నాడు. ఊరి కష్టాలను తన కష్టాలనుకున్నాడు. ఊరు బాగుంటే తాను బాగుంటా అనుకున్నాడు. అందుకే గ్రామంలో ఏ సమస్య వచ్చినా..అధికారులకు తెలిపేవాడు. వారి చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా..పట్టించుకోకపోయేసరికి చివరికి ముఖ్యమంత్రికే తమ బాధను చెప్పాలనుకున్నాడు. ఊరి కోసం ..తమ బాధ అర్థమయ్యేలా కాలినడకన అమరావతి బయలుదేరాడు. కానీ మార్గమధ్యలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు తీసుకెళ్లారో తెలీదు. ఫోన్ లేదు. జాడలేదని... ఇప్పటివరకైతే ఇంటికి చేరనేలేదని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

a man missing while going to meet cm at balive village
ఆంజనేయులు

By

Published : Apr 11, 2021, 12:22 PM IST

సీఎంను కలవాలని వెళ్లని వ్యక్తి అదృశ్యం

తమ గ్రామసమ్యలను తీర్చాలని ఓ వ్యక్తి పాటుపడ్డాడు. గ్రామంలో బస్సు సౌకర్యం కోసం కాలినడకన ముఖ్యమంత్రికి దగ్గరికి బయలుదేరారు. ఏమైందో ఏమో..మధ్యలోనే అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. గంటలోనే పంపామని మీడియాతో పోలీసులు చెప్పారు. కానీ అతను ఇంకా ఇంటికి రాలేదు. అతను ఎక్కడున్నాడో..ఏమో అని గ్రామస్థులు కలవరపడుతున్నాడు.

కృష్ణా జిల్లా ముసునురు మండలం బలివే గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ... ఆంజనేయులు అనే వ్యక్తి అమరావతికి బయలు దేరాడు. నూజివీడుకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్ధులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ సమస్యలపై పలు మార్లు అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేకపోవడంతో.. ముఖ్యమంత్రి కార్యాలయంకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అమరావతికి కాలి నడకన బయలుదేరాడు.

అలా వెళ్తూ ఉండగా.. మార్గమధ్యలో ఆంజనేయులును పోలీసులు అడ్డుకొని స్టేషన్​కు తీసుకువెళ్లారు. నిన్న ఉదయం పోలీసుస్టేషన్​కు వెళ్లిన ఆంజనేయులు ఇప్పటివరకు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. స్టేషన్​కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి గంటలో పంపించివేశామని.. మీడియాకు పోలీసు అధికారులు తెలిపారు. అంజనేయులు ఫోన్ స్విచ్చాఫ్ అయ్యింది. అతను ఎక్కడున్నాడో.. ఏమో, తిన్నాడో..లేడో, బతికున్నాడో ..లేడో అని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చూడండి.కడప పాత బస్టాండులో ఓ వ్యక్తి వీరంగం

ABOUT THE AUTHOR

...view details