కృష్ణా జిల్లా గన్నవరం కూడలిలో ఓ వ్యక్తి రెండు రోజులుగా రోడ్డు పక్కన పడి ఉన్నాడు. కొవిడ్ భయంతో చుట్టూ ఉన్న వారెవరు దగ్గరికి వెళ్లలేదు. గతరాత్రి కొందరు వ్యక్తులు 108కి ఫోన్ చేసి చెప్పగా వారు వచ్చి.. ఇతను కొవిడ్ పేషంట్ అని చెప్పి వదిలేసి వెళ్లిపోయారు. మరో వైపు ఆక్సిజన్ అందక బాధితుడు కొట్టుమిట్టాడుతున్నాడు.
రెండు రోజులుగా రోడ్డు పక్కనే కొవిడ్ బాధితుడు - covid patient at road side in Gannavaram
కరోనా మానవ సంబంధాలను తెంచేస్తోంది. సాటి మనిషి రోడ్డు మీద ప్రాణాల కోసం పోరాడుతున్నా పట్టించుకోవటం లేదు. చివరికి వైద్యం అందించాల్సిన సిబ్బంది కూడా కొవిడ్ బాధితుడు అంటూ.. నిర్ధాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిపోతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ అమానవీయ ఘటన జరిగింది.
కొవిడ్ బాధితుడు