కృష్ణా జిల్లా విస్సన్నపేట గ్రామ ప్రధాన కూడలిలో ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. బ్లేడ్‌తో తన కాళ్లు చేతులు కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న యువకుడి దగ్గరకి వెళ్లడానికి స్థానికులు కొంతసేపు భయపడ్డారు. అనంతరం వారు 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది స్ధానికుల సాయంతో యునకుడికి వైద్య సాయం అందించి బంధువులకు సమాచారం అందించారు. కాగా యువకుడి పేరు సాయి అని... ఒక హోటల్ లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు.
ప్రధాన కూడలిలో చేతులు, కాళ్లు కోసుకున్నాడు.. - విస్సన్నపేటలో మద్యంబాబు వార్తలు
కృష్ణా జిల్లా విస్సన్నపేట గ్రామ ప్రధాన కూడలిలో ఓ యువకుడు మద్యం మత్తులో హల్ చల్ చేశాడు. బ్లేడ్‌తో తన కాళ్లు చేతులు కోసుకొని కూడలిలో కూర్చుని స్థానికులని భయభ్రాంతులకు గురిచేశాడు.
విస్సన్నపేటలో మద్యంబాబు