కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని పోచంపల్లిలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన తేళ్లురి అంకిరేడి అనే వ్యక్తి ఈ నెల 22వ తేదిన... రాత్రి సమయంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. కుటుంబ వివాదాలు కారణంగా చాలా కాలం నుంచి అతని భార్య, ఇద్దరు పిల్లలు హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారు. సమీపంలోని స్థానికులు మరణ విషయాన్ని తెలియజేసినప్పటికి... వారు చివరి చూపునకు రావటానికి నిరాకరించారు. కుటుంబ సభ్యులు ఉంటేనే దహన సంస్కారాలు చేసే అవకాశం ఉంటుందని గ్రామస్థులు చెబుతున్నారు. పంచాయతీ, పోలీస్ అధికారులకు సమాచారం అందజేసిన స్పందించకపోవడంతో స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి... అంత్యక్రియలకు ముందుకురాని కుటుంబం... - కృష్ణా తాజా వార్తలు
పోచంపల్లిలో ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. అయితే పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకొకపోవటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
పోచంపల్లిలో అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి