ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి

బొలెరో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా మద్దిరాలలో జరిగింది. ప్రమాదానికి కారణమైన వాహనం ఆపకుండా వెళ్లిపోయిన క్రమంలో ఇద్దరు యువకులు 10 కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్నారు. పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి
బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి

By

Published : Jul 16, 2020, 8:26 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల సమీపంలో బొలెరో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం యనమదల గ్రామానికి చెందిన నూతి నాగేశ్వరరావు.. చిలకలూరిపేటలోని గోపాలవారిపాలెం గ్రామంలో తన అత్తగారింటికి వెళ్లాడు. తన కుమార్తెను వెంటబెట్టుకుని ద్విచక్రవాహనంపై తీసుకువెళ్తుండగా.. మద్దిరాల గ్రామం వద్ద బొలెరో వాహనం ఢీకొట్టింది.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావును నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. ఇది గమనించిన ఇద్దరు యువకులు వాహనాన్ని పది కిలోమీటర్లు వెంబడించి చిలకలూరిపేట వద్ద అడ్డుకుని.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details