అటవీలో ప్రేమజంట ఆత్మహత్య.. ప్రేయసికి 6 నెలల క్రితం మరొకరితో పెళ్లి నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సయీద్పూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఓ ప్రేమ జంట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. మోస్రా మండలం తిమ్మాపూర్కి చెందిన మోహన్, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలానికి చెందిన లక్ష్మిగా గుర్తించారు.
పక్షం రోజుల క్రితమే..
వారిద్దరూ 15 రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతురాలు లక్ష్మికి ఆరు నెలల క్రితం మరికొకరితో వివాహం జరిగింది. సుమారు 15 రోజుల క్రితం వారు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం దేహాలను ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి : ఆగస్టు 2 నుంచి సివిల్స్ ఇంటర్వ్యూలు