ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోళ్ల లారీ బోల్తా... గంటలోపే అన్నీ మాయం! - విజయవాడలో లారీ బోల్తా

కృష్ణా జిల్లాలో కోళ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. వందల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. తీవ్ర గాయాలపాలైన లారీ డ్రైవర్ ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

Lorry Accidnet
లారీ బోల్తా

By

Published : Jan 3, 2021, 1:11 PM IST

కృష్ణా జిల్లా విజయవాడ - నూజివీడు బైపాస్ వద్ద కోళ్ల లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. లారీలోని వందల కోళ్లు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ గాయాలపాలవగా.. అతన్ని స్థానికులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన సమయంలో లారీ తాలుకా వారు ఎవరు లేకపోవడంతో కోళ్లన్నీ చోరీకి గురయ్యాయి. ఆ దారి వెంట వెళ్లిన వాహనదారులు చనిపోయిన కోళ్లను తీసుకువెళ్లారు. గంట వ్యవధిలోనే లారీలో కోళ్లన్నీ మాయం అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details