అనుమానస్పద స్థితలో యువతి మృతి
యువతి అనుమానాస్పద మృతి - కృష్ణా జిల్లాలో బావిలో పడి యువతి మృతి
కృష్ణా జిల్లా తిరువూరు మండలం వామకుంట్ల గ్రామానికి చెందిన రామడుగు ఆస్రిత అనే యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. మంచినీటి బావిలో ఆమె పడి ఉండటాన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా... ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బావిలో నుంచి బయటకి తీయించారు. రెండు రోజుల క్రితం అస్రిత అదృశ్యమైనట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అనుమానస్పద స్థితలో యువతి మృతి