ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తలుపు కొడుతుండగానే కరెన్సీని కాల్చేసిన మాజీ ఉప ఎంపీపీ

నాగర్​కర్నూల్ జిల్లాలో మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. పెద్ద ఎత్తున అవినీతిని ప్రోత్సహిస్తున్న తాహసీల్దార్​, పరాయి సొమ్ముకు ఆశపడిన ఉప ఎంపీపీ వెంకటయ్య గౌడ్​ల లంచగొండితనాన్ని బాధితుడు అనిశా అధికారులకు చేరవేశాడు. ఏసీబీ అధికారుల ధాటికి కరెన్సీ నోట్లను గ్యాస్​ స్టౌపై పెట్టి కాల్చేస్తున్న వెంకటయ్యను అధికారులు పట్టుకున్నారు.

తలుపు కొడుతుండగానే కరెన్సీని కాల్చేసిన మాజీ ఉప ఎంపీపీ
తలుపు కొడుతుండగానే కరెన్సీని కాల్చేసిన మాజీ ఉప ఎంపీపీ

By

Published : Apr 7, 2021, 6:30 AM IST

తెలంగాణలోని నాగర్​కర్నూల్ జిల్లాలో మరో అవినీతి బాగోతం బయటపడింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరెంతకుంట తండా సర్పంచ్ రాములు.. వెల్దండ మండలం బొల్లంపల్లిలో కంకర మిల్లు నడుపుకునేందుకు మైనింగ్ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.

తలుపు కొడుతుండగానే కరెన్సీని కాల్చేసిన తాహసీల్దార్

ఎన్​ఓసీ ఇవ్వాల్సిందిగా..

సర్వే చేసి.. నిరంభ్యతర పత్రం ఇవ్వాల్సిందిగా వెల్దండ తహశీల్దార్ సైదులుకు దరఖాస్తు పెట్టుకున్నారు.

'మాజీ ఉప ఎంపీపీని కలవండి'

పని పూర్తి కావాలంటే కల్వకుర్తి పట్టణంలో నివాసం ఉండే మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య గౌడ్​ను కలవాల్సిందిగా తహశీల్దార్ సూచించారు. వెంకటయ్య గౌడ్​ను బాధితుడు కలవగా.. ఆయన రూ. 6 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు 5 లక్షలకు ఒప్పందం కుదిరింది.

ఏసీబీ రంగ ప్రవేశం..

రూ.5 లక్షలు సిద్ధం చేసుకున్న రాములు.. ఏసీబీ అధికారులను సంప్రదించారు. వెంకటయ్య గౌడ్ ఇంటి వద్దకు వెళ్లి లంచంగా డిమాండ్ చేసిన రూ. 5 లక్షలను ముట్టజెప్పారు.

ఇంతలోనే గ్యాస్​ స్టౌపై కాల్చారు..

ఈలోపు ఏసీబీ అధికారులు దాడులు చేయగా.. గమనించిన వెంకటయ్య గౌడ్ తలుపులు మూసి.. నగదును గ్యాస్ స్టౌపై కాల్చేశారు. ఏసీబీ అధికారులు బలవంతంగా తలుపులు తెరిచే లోపు 70 శాతం నోట్లు కాలిపోయాయి.

కరెన్సీ స్వాధీనం..

నోట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు ఏకకాలంలో తహశీల్దార్ సైదులుకు చెందిన ఎల్బీనగర్​లోని నివాసంలో, వెల్దండ తహశీల్దార్ కార్యాలయం, జిల్లెలగూడలోని వెంకటయ్య గౌడ్ ఇంట్లో.. సోదాలు నిర్వహించినట్లు మహబూబ్​నగర్ ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ వెల్లడించారు.

ఇదీ చూడండి :మరో మహిళతో దొరికిపోయిన హోంగార్డు

ABOUT THE AUTHOR

...view details