Murder: మద్యం మత్తులో తండ్రిని దారుణంగా హత్య చేసిన కొడుకు - మద్యం మత్తులో తండ్రిని చంపిన కుమారుడు
19:26 April 03
కృష్ణా జిల్లా మాచవరం పరిధి ఉడ్‌పేటలో దారుణం
Son Murdered his Father in Krishna District: కృష్ణా జిల్లా మాచవరం మండలం ఉడ్‌పేటలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కుమారుడు కిట్టు.. తండ్రి రమేశ్‌ను కత్తిలో పొడిచి హత్య చేశారు. అందరూ చూస్తుండగానే తండ్రిని వెంటబడి మరీ హతమార్చాడు నిందితుడు. ఈ క్రమంలో అడ్డొచ్చిన పెంపుడు శునకంపైనా కత్తితో దాడి చేశాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. హత్యకు కుటుంబకలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి:AP Crime News: ఆర్టీసీ బస్సు బోల్తా.. ఐదుగురికి తీవ్ర గాయాలు