కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి లంక గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు.. కొంతకాలంగా పెదపులిపాకలో నివాసం ఉన్నాడు. కడుపులో ఇన్ఫెక్షన్తో కొంత కాలంగా విజయవాడలో చికిత్స తీసుకున్నాడు. నిన్న రాత్రి చనిపోగా.. ప్రైవేటు అంబులెన్స్‌లో మృతదేహాన్ని అతని స్వగ్రామం మోపిదేవి లంకకు తీసుకువెళ్లారు. కరోనా భయంతో.. ఆ మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు మృతుడి సోదరుడు సహా బంధవులంతా నిరాకరించారు. అంబులెన్స్ సిబ్బంది మృతదేహాన్ని తెల్లవారుజామున 3 గంటల సమయంలో అక్కడే రోడ్డుపై వదిలేసి వెళ్లగా.. మృతుడి భార్య కన్నీటి పర్యంతమైంది. అయినా... స్థానికులు ఏ మాత్రం చలించలేదు. ఎక్కడో అనారోగ్యానికి గురైతే ఇక్కడికి తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే మృతదేహాన్ని తీసుకుపోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాతో కాదని.. అనారోగ్యంతోనే వెంకటేశ్వరరావు చనిపోయాడనీ పోలీసులు చెప్పినా మోపిదేవి లంక ప్రజలు వినలేదు. చివరికి.. మృతదేహాన్ని పోలీసులు పెదపులిపాకకు తరలించారు.
కరోనా ఎఫెక్ట్: అందరూ ఉన్నా రోడ్డుపైనే అనాథ శవంలా! - mopidevi lanka crime news
అనారోగ్యంతో ఆసుపత్రికి చేరిన వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని ఇంటికి పంపించేద్దామంటే కరోనా భయంతో గ్రామస్తులు నిరాకరించారు. సొంత సోదరుడు సైతం ఖననం చేయడానికి ముందుకు రాలేదు. ఏం చేయాలో తెలియని ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని సొంత ఊరిలో రోడ్డుపైనే వదిలేశారు. అందరూ ఉండి అనాథ శవంలా రోడ్డుపైనే పడేయగా.. మృతుడి భార్య కన్నీటి పర్యంతమయ్యింది.
A dead body left on the road at mopidevi lanka in krishna