Twists in Murder Case: కృష్ణా జిల్లాలో సంచలనం రేపిన తోట్లవల్లూరు హత్య కేసు కీలక మలుపు తిరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన ఈ హత్య అప్పట్లో కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులతో రాజీ కుదిర్చేందుకు ఇద్దరు దళారులు పోటీ పడిన నేపథ్యంలో.. మరో హత్య జరిగిన విషయం తాజాగా వెలుగు చూసింది. ఈ కేసులో నిందితుడైన శ్రీకాంత్‌రెడ్డిని విడిపిస్తానంటూ నరేంద్రరెడ్డి అనే వ్యక్తి మృతుడి కుటుంబ సభ్యులను సంప్రదించాడు. కేసును విచారిస్తున్న సీఐకు రూ.22 లక్షలు కూడా అందజేశాడని తెలిసింది. ఈ సమయంలో రంగ ప్రవేశం చేసిన మరో దళారి శ్రీనివాసరెడ్డి.. తాను ఇంకా తక్కువ ధరకే పోలీసులతో రాజీ చేస్తానని చెప్పినట్టు తెలిసింది. తన డీల్‌కు శ్రీనివాసరెడ్డి అడ్డు వస్తున్నాడని భావించిన నరేంద్ర రెడ్డి.. సెప్టెంబరు 20న అతడిని హత్య చేసి.. మృతదేహాన్ని పూడ్చాడు. ఆ తర్వాత విషయం బయటకు పొక్కడంతో పోలీసులు నరేంద్రరెడ్డితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వారిని విచారిస్తున్న సమయంలో పోలీసులతో నరేంద్రరెడ్డికి డీల్ కుదిరిన విషయం బయటకొచ్చింది. విషయం ఎస్పీ వరకూ వెళ్లడంతో ఆయన రహస్యంగా విచారణ జరిపిస్తున్నట్లు తెలిసింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు ఎస్సై, సీఐలను వీఆర్‌కు పంపించారు. ఈ ఉదంతంలో మరికొందరు పోలీసులపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే:ఈ ఏడాది జులై, 26వ తేదీ తెల్లవారుజామున.. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు శివారు ఆళ్లవారిపాలెంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి గడికొయ్య శ్రీనివాసరెడ్డి (38) హత్యకు గురయ్యాడు. కొవిడ్ కారణంగా శ్రీనివాసరెడ్డి .. ఆళ్లవారిపాలెంకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి చిన్ననాటి నుంచి స్నేహితులు. శ్రీకాంత్‌రెడ్డి ఊళ్లో ఉంటూ వ్యవసాయం చేస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన మిథున అలియాస్ జ్యోతితో శ్రీకాంత్‌రెడ్డికి వివాహేతర సంబంధం ఉండేది. ఓసారి శ్రీకాంత్‌రెడ్డి ఫోన్ మొరాయించడంతో దానిని శ్రీనివాసరెడ్డి వద్దకు తీసుకెళ్లాడు. అందులో వారిద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలను చూశాడు. వాటిని చూపించి, శ్రీనివాసరెడ్డి మిథునను లొంగదీసుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డికి భయపడి శ్రీకాంత్‌రెడ్డిని మిథున దూరం పెట్టింది. తర్వాత అసలు విషయం తెలుసుకున్న శ్రీకాంత్‌రెడ్డి.. తన మిత్రుడు శ్రీనివాసరెడ్డిని చంపేందుకు నిర్ణయించుకున్నాడు. మిథునతో ఫోన్ చేయించి జులై, 25వ తేదీ రాత్రి శ్రీనివాసరెడ్డిని ఇంటికి రప్పించారు. తెల్లవారుజామున అక్కడికి వచ్చిన శ్రీనివాసరెడ్డిని శ్రీకాంత్‌రెడ్డి హతమార్చాడు. అనంతరం మిథునను తీసుకుని పరారయ్యాడు. ఈ కేసులో శ్రీకాంత్‌రెడ్డి, మిథునలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
కేసును నీరుగారుస్తానని హత్య: ఈ కేసును నీరుగార్చి, రాజీ చేస్తానని భద్రిరాజుపాలెం గ్రామానికి నరేంద్రరెడ్డి తెరపైకి వచ్చాడు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడతానని ఖర్చు అవుతుందని నిందితుడి తండ్రిని సంప్రదించాడు. ఈ మేరకు వారి మధ్య డీల్ కుదిరింది. తొలి విడతగా కేసును విచారిస్తున్న సీఐతో రూ. 22 లక్షలకు మాట్లాడుకున్నాడు. ఈమేరకు సీఐకు నరేంద్రరెడ్డి డబ్బులు అందజేశాడు. ఇంతలో.. ఇదే గ్రామానికి చెందిన పుచ్చకాయల శ్రీనివాసరెడ్డికి విషయం తెలిసి రిమాండ్‌లో ఉన్న నిందితుడిని కలిశాడు. తాను రూ.20 లక్షలకే రాజీ చేస్తానని నిందితుడితో చెప్పాడు. దీనిని పసిగట్టిన నరేంద్రరెడ్డి.. తన డీల్‌కు పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి అడ్డు వస్తున్నాడని భావించి చంపాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. తన కారు అయితే అందులో రావడానికి పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి ఒప్పుకొడనే అనుమానంతో తోట్లవల్లూరుకు చెందిన ఓ వైకాపా నాయకుడి కారును నరేంద్రరెడ్డి తీసుకున్నాడు.