కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం వద్ద ఓ కారు ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. అదుపు తప్పిన కారు.. డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భాష్యం కృష్ణ ప్రసాద్, శైలజ అనే దంపతులకు స్వల్పగాయాలయ్యాయి. వీరు మంగళగిరి నుంచి జగ్గయ్యపేట వెళ్తుండగా అనాసాగరం వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న నందిగామ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు.
కారు ఇంజిన్లో చెలరేగిన మంటలు.. ఇద్దరికి గాయాలు - నందిగామ రోడ్డు ప్రమాదం
జాతీయ రహదారిపై కారు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. అదుపుతప్పిన కారు.. డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి దంపతులకు స్వల్పగాయాలయ్యాయి.
కారు ఇంజన్ లో చెలరేగిన మంటలు