ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాపై... పెద్దలకు బుడతడి అవగాహన - విజయవాడలోవాహనదారులకు కరోనాపై చిన్నారి అవగాహన

వాహనదారులకు ఓ బుడతడు.. కరోనాపై అవగాహన కల్పించాడు. అనవసరంగా బయటకు రావొద్దని.. కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించాడు. ఉన్నది వేలెడే అయినా పెద్ద ప్రయత్నమే చేశాడు.

a boy awareness on corona in vijayawada
కరోనాపై అవగాహన కల్పిస్తున్న బాలుడు నాహీద్ చౌదరి

By

Published : Jun 4, 2020, 4:04 PM IST

లాక్ డౌన్ సడలింపులతో రోడ్లపైకి విచ్ఛలవిడిగా వస్తున్న వాహనచోదకులకు.. ఓ బాలుడు కరోనాపై అవగాహన కల్పించాడు. కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటూ విజయవాడ బెంజిసర్కిల్ కూడలిలో నుంచుని.. నాహీద్ చౌదరి అనే ఓ బాలుడు ప్లకార్డులు ప్రదర్శించాడు.

కొవిడ్ అనేది మూడో ప్రపంచ యుద్ధం లాంటిదని... ఈ యుద్ధంలో గెలవాలంటే మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాల్సిందే అని ప్లకార్డుల్లో సూచించాడు. ప్రతి ఒక్కరూ పోలీసులు, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశాడు.

ABOUT THE AUTHOR

...view details