కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలుడిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్థానికంగా ఇంటి సమీపంలో ఓ బాలుడు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి.. చాక్లెట్ ఇప్పిస్తానంటూ ఆ బాలుడిని పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలుడు నోటిలో వెనుక భాగంలో రాళ్లు కుక్కి వెళ్లిపోయాడు. కొంతసేపటి తరువాత తేరుకున్న బాలుడు.. ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పీఎస్లో సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మగ పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. దారుణానికి పాల్పడి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.