ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో 97 మండలాలు రెడ్‌జోన్లుగా గుర్తింపు - red zones in ap

కరోనా వైరస్‌ ప్రభావం ఉన్న రెడ్‌జోన్‌లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని రాష్ట్రంలో 97 మండలాలను రెడ్‌జోన్‌గా ఖరారు చేసింది. ఆయా ప్రాంతాల్లోనే కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా...చర్యలు చేపట్టాలని కలెక్టర్లును ఆదేశించింది

రాష్ట్రంలో 97 మండలాలు రెడ్‌జోన్లగా గుర్తింపు
రాష్ట్రంలో 97 మండలాలు రెడ్‌జోన్లగా గుర్తింపు

By

Published : Apr 19, 2020, 6:41 AM IST

రాష్ట్రంలో 97 మండలాలు రెడ్‌జోన్లగా గుర్తింపు

రాష్ట్రంలో 97 మండలాలను రెడ్‌జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా పాజిటివ్‌ కేసుల ఆధారంగా ప్రభుత్వం రెడ్‌జోన్‌ మండలాలను ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 676 మండలాలు ఉండగా అత్యధిక కరోనా కేసులు నమోదైన మండలాలను గుర్తించింది. మండల కేంద్రం యూనిట్‌గా రెడ్‌జోన్లలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించింది. రెడ్‌జోన్లలో 14 రోజుల పాటు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాకుంటే ఆ మండలాన్ని ఆరెంజ్‌ జోన్‌ పరిధిలోకి తీసుకొస్తారు. అప్పట్నుంచి మరో 14 రోజులపాటు పాజిటివ్‌ కేసు నమోదుకాకుంటే దాన్ని గ్రీన్‌జోన్‌ మండలంగా ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు గ్రీన్‌జోన్‌గా ఉన్న మండలంలో కరోనా కేసులు నమోదైతే దాన్ని రెడ్‌జోన్‌లోకి చేర్చనున్నారు.

కర్నూలు జిల్లాలో అత్యధికంగా 17 మండలాలు రెడ్‌జోన్లో ఉన్నాయి. నె‌ల్లూరు జిల్లాలో 14, గుంటూరు జిల్లాలో 12 మండలాలు రెడ్‌జోన్లోకి వెళ్లాయి. పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో తొమ్మిదేసి, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో ఎనిమిదేసి మండలాలు చొప్పున రెడ్‌జోన్లుగా ప్రకటించారు. కడప జిల్లాలో 7, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో ఐదేసి, విశాఖలో మూడు మండలాల చొప్పున రెడ్‌జోన్లుగా ప్రకటించారు.

రాష్ట్రంలో 11 జిల్లాలను కేంద్రం హాట్‌స్పాట్‌గా ప్రకటించడంపై రాష్ట్రప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జాతీయస్థాయిలో సగటున 6.2 రోజులకు కేసులు రెండింతలు అవుతున్నాయి. అదే మనరాష్ట్రంలోని కర్నూలులో 2.5 రోజులు, గుంటూరు జిల్లాలో 3.3 రోజులు, చిత్తూరు జిల్లాలో 3.7 రోజులు, అనంతలో 3.9రోజుల్లో రెండింతలు పెరిగాయి. ఐతే కొన్ని రాష్ట్రాల్లోని జిల్లాల విస్తీర్ణం, జనాభాతో పోల్చితే ఏపీలోనే ఎక్కువ. ఈ పరిస్థితుల్లో జిల్లా మొత్తాన్ని హాట్‌స్పాట్‌గా ప్రకటించడం భావ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిసింది.

ఇవీ చదవండి

ఆదాయం తగ్గింది

ABOUT THE AUTHOR

...view details