ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అవనిగడ్డలో.. గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు - Avanigadda police latest news

గంజాయి రవాణా చేస్తున్న ముఠాను, వ్యాపారులను అవనిగడ్డ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 10 కిలోల గంజాయి, రూ.5200 నగదు, 11 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

9 Members Arrest in Avanigadda who supplies Ganja
అవనిగడ్డ.. గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు

By

Published : Sep 29, 2020, 9:59 PM IST

ఒకప్పుడు నగరాలకే పరిమితమైన గంజాయి కల్చర్... ఇప్పుడు పల్లెలకు పాకింది. కాలేజీ యువతను టార్గెట్ చేసుకుని కొందరు గంజాయి దందా సాగిస్తున్నారు. గంజాయి రవాణా గుట్టును అవనిగడ్డ పోలీసులు రట్టు చేశారు. విశాఖకు చెందిన వ్యాపారిని, రవాణా చేస్తున్న మరో 9 మందిని పోలీసులు అరెష్టు చేశారు. రవాణా, అమ్మకాలు చేస్తూ పట్టుబడిన వారిలో ఏడుగురు విద్యార్థులు, ఒక బ్యాంకు ఉద్యోగి ఉన్నారు.

అరెస్ట్ అయిన వారి నుంచి 10 కిలోల గంజాయి, రూ.5200 నగదు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నాగాయలంకలో జరుగుతున్న అమ్మకాల ఆధారంగా నిఘా పెట్టిన పోలసులు... జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అమ్మకాలు చేస్తున్నవారిని, రవాణాదారులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రమేష్ రెడ్డి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details