విజయవాడ అజిత్సింగ్ నగర్ వద్ద ఉన్న కాలువలోకి దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. న్యూ రాజరాజేశ్వరి పేట వాటర్ ట్యాంక్ సమీపంలో ఉంటున్న బూర్ల అమ్ములమ్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్థరించారు.
ఆర్థిక ఇబ్బందులతో వృద్ధురాలి ఆత్మహత్య - అజిత్నగర్లో వృద్ధురాలు ఆత్మహత్య
ఆర్థిక బాధలు... కాలిన గాయాన్ని ఆ వృద్ధురాలు తట్టుకోలేక పోయింది. 80 ఏళ్ల వయస్సులో ఆత్మహత్య చేసుకొని, మానసిక పరిపక్వత లేని కుమారుడిని ఒంటరిని చేసింది. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా విజయవాడలో జరిగింది.
వృద్ధురాలు ఆత్మహత్య
అమ్ములమ్మ ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు ఆగిరిపల్లిలో ఉంటున్నాడు. చిన్నకుమారుడుకి మానసిక ఎదుగదల లేకపోవటంతో ఆమె వద్దే ఉంటున్నాడు. ఇటీవలే వేడి టీ కాలి మీద పడటంతో తీవ్ర గాయమయ్యింది. పైగా అప్పులు కూడా ఎక్కువ కావటంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. బుడమేరు కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.
Last Updated : Jun 23, 2020, 10:18 AM IST