కృష్ణా జిల్లా ఆత్కూరు వద్ద అపహరణకు గురైన 8 నెలల బాలుని కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను 48 గంటల్లోపు పట్టుకున్నట్లు విజయవాడ డీసీపీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. డబ్బులు తిరిగి చెల్లించే క్రమంలో జరిగిన వాగ్వాదం బాలుడు అపహరణకు కారణమైందని ఆయన తెలిపారు. తమ బిడ్డను అపహరించారని సోను దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఆత్కూరు, గన్నవరం పోలీసులు త్వరితగతిన దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు రాజస్థాన్ పారిపోయారని సమాచారం తెలుసుకున్న పోలీసులు..వారి కంటే ముందే విమానంలో రాజస్థాన్ చేరుకున్నారు. అక్కడి రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశారు. తద్వారా వారి ఆచూకీ కనుగొన్నట్లు విజయవాడ డీసీపీ తెలిపారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.
బాలుడి అపహరణ కేసు..48 గంటల్లోనే ఛేదించిన పోలీసులు - విజయవాడ డీసీపీ హర్షవర్ధన్ రాజు
8 నెలల బాలుడి కేసును 48 గంటల్లోపే ఛేదించామని విజయవాడ డీసీపీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.
'48 గంటల్లోపే కేసును సుఖాంతం చేశాం'