. కొనసాగుతున్న కొవిడ్ కల్లోలం: కొత్తగా 4,228 కేసులు.. 10 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 4,228 కొవిడ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. మరో 1,483 బాధితులు కోలుకోగా.. 10 మరణాలు సంభవించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
. సీఈసీని కలిసిన తెదేపా ఎంపీలు..రాళ్లదాడి ఘటనపై ఫిర్యాదు
తిరుపతి ఉప ఎన్నికలో కేంద్ర బలగాలతో పోలింగ్ జరపాలని తెదేపా ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని, హోంశాఖ కార్యదర్శిని కోరారు. చంద్రబాబు ప్రచార సభలో జరిగిన రాళ్ల దాడిపై ఫిర్యాదు చేసిన ఎంపీలు..పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఈసీకి వినతి పత్రం అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
. రాళ్లదాడి ఘటనపై ఎలాంటి ఆధారాలు లభించలేదు: డీఐజీ
చంద్రబాబు బహిరంగ సభను అడ్డుకోవాలని రాళ్ల దాడి చేసినట్లు ఆధారాలు లభించలేదని అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షులను పరిశీలించినా తమకు ఆధారాలు లభించలేదన్నారు. ఫిర్యాదు చేసిన తెదేపా నాయకులను ఆధారాలను సమర్పించాలని కోరామని..ఈ విషయమై చంద్రబాబుకి నోటీసు ఇచ్చామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
. 'కరోనా కథ ముగియలేదు.. టీకా ఒక్కటే మార్గం కాదు'
ప్రపంచవ్యాప్తంగా 78 కోట్ల టీకాలు అందించినా.. కరోనా అంతరించడానికి ఇంకా చాలా సమయం ఉందన్నారు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్. వైరస్ను అరికట్టడానికి టీకా ఒక్కటే మార్గం కాదని, ఇంకా చాలా సాధనాలు ఉన్నాయని చెప్పారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదా?
క్రిమియా ప్రాంతంలో ఘర్షణల నేపథ్యంలో రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. సరిహద్దుల్లో రష్యా భారీ స్థాయిలో బలగాలను మోహరిస్తోంది. ఇందుకు పలు కారణాలను చెబుతోంది. అయితే ఈ పరిణామాలు ఇరు దేశాలకు మంచిది కావని ఉక్రెయిన్ హెచ్చరిస్తోంది. పరిస్థితిని అదుపు చేసేందుకు దౌత్యపరంగా ప్రయత్నిస్తోంది. కానీ రష్యా అందుకు సహకరించడం లేదని మండిపడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.