corona cases: రాష్ట్రంలో కొత్తగా 765 కరోనా కేసులు, 9 మరణాలు - corona virus
16:40 October 03
ap corona cases
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 45,481 పరీక్షలు నిర్వహించగా.. 765 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,52,763 మంది వైరస్ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్ బారినపడి 9 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాష్ట్రంలో మృతుల సంఖ్య 14,204కి చేరింది. 24 గంటల వ్యవధిలో 973 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,28,202కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,357 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,84,45,952 నమూనాలను పరీక్షించారు.
ఇదీ చదవండి