ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దైవ దర్శనానికి వెళ్లొచ్చేసరికి..ఇంట్లో చోరీ - krishna district

కుటుంబ సమేతంగా దైవ దర్శనానికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో దొంగలు పడిన ఘటన గండిగుంటలో జరిగింది. బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

'గండిగుంటలో 7 లక్షలు చోరీ'

By

Published : Aug 30, 2019, 10:19 PM IST

'గండిగుంటలో 7 లక్షలు చోరీ'

కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంటలోని పొన్నం శేఖర్ బాబు ఇంట్లో దొంగలు పడ్డారు. శేఖర్​బాబు కుటుంబ సమేతంగా అన్నవరం దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరుచుకుని ఉన్నాయి. ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.బాధితుని పిర్యాదు మేరకు రూ.7 లక్షల నగదు, 4 కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యినట్లు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details