కృష్ణా జిల్లా గన్నవరం క్వారంటైన్ కేంద్రం నుంచి 60మందిని అధికారులు వారి స్వస్థలాలకు పంపించారు. 60మంది కరోనా అనుమానితులు ఆరోగ్యంగా ఉండటం, రెండు పర్యాయాలు కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావటంతో వారిని అధికారులు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేసి వారి గృహాలకు పంపించారు. కాగా ఇంట్లో సైతం స్వీయ నిర్బంధం పాటించి అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
గన్నవరం క్వారంటైన్ కేంద్రం నుంచి 60 మంది డిశ్చార్జ్ - corona
కృష్ణా జిల్లా గన్నవరం క్వారంటైన్ కేంద్రం నుంచి 60మంది కరోనా అనుమానితులను వారి స్వస్థలాలకు పంపించారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోవడం, కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడం వంటి కారణాలతో వారిని ఇళ్లకు పంపించామని అధికారులు తెలిపారు.
గన్నవరం క్వారంటైన్ కేంద్రం నుంచి 60 మంది విడుదల