ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ 4 రోజుల్లో రోజుకు 6 లక్షల చొప్పున వ్యాక్సినేషన్ జరగాలి: సీఎం - Ap Corona Vaccination Latest News

కరోనా నివారణ, వ్యాక్సినేషన్ ప్రక్రియపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​కు ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ గా హాజరయ్యారు. అనంతరం.. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను చురుగ్గా చేపట్టాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.

ఆ 4 రోజుల్లో రోజుకు 6 లక్షల వ్యాక్సినేషన్ జరగాలి : సీఎం
ఆ 4 రోజుల్లో రోజుకు 6 లక్షల వ్యాక్సినేషన్ జరగాలి : సీఎం

By

Published : Apr 8, 2021, 9:33 PM IST

కరోనా నివారణపై ప్రధాని మోదీ.. ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర సీఎం జగన్.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ద్వారా పాల్గొన్నారు. ప్రధానితో సమావేశం ముగిశాక రాష్ట్ర ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆ 4 రోజులు టీకా ఉత్సవ్..

కేంద్రం చెప్పినట్లు ఏప్రిల్‌ 11 నుంచి 14 వరకూ టీకా ఉత్సవ్‌ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఆ సమయంలో రోజుకు కనీసం 6 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా చూడాలన్నారు. ఆ 4 రోజులు కనీసం 24 లక్షల మందికి వాక్సిన్‌ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.

'కేంద్రాన్ని కోరాలి'

వ్యాక్సిన్‌ డోసులు తగినన్ని కావాలని.. ఈ విషయమై కేంద్రాన్ని కోరాలని అధికారులకు సూచించారు. ఇందుకు కేంద్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఎన్నికలు ముగిసినందున.. వ్యాక్సినేషన్​‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ కోసం అన్నిరకాలుగా సిద్ధం కావాలని యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత వ్యాక్సినేషన్ విజయవంతమయ్యాక మరిన్ని డోసులు తెప్పించుకోవడంపై దృష్టిపెట్టాలన్నారు.

ఇవీ చూడండి:

'ప్రాణం పోయినా సరే చిత్తూరులో ప్రజాస్వామ్యాన్ని కాపాడతా'

ABOUT THE AUTHOR

...view details