ఆంధ్రప్రదేశ్‌లోని 56 బీసీ కులాల కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా 672 మందిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కార్పొరేషన్ల వారీగా డైరెక్టర్ల జాబితాను బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సచివాలయంలో విడుదల చేశారు. ఒక్కో కార్పొరేషన్‌కు 12మంది చొప్పున డైరెక్టర్లను నియమించినట్లు వెల్లడించారు. వీరిలో 339 మంది మహిళలు కాగా, 333 మంది పురుషులని తెలిపారు. ఏలూరులో బీసీ డిక్లరేషన్ సందర్భంగా చెప్పిన మాటను జగన్ ఆచరణలో చేసి చూపించారని మంత్రి పేర్కొన్నారు. కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టులను కూడా కలిపితే మొత్తం 720 మంది బీసీలకు ప్రభుత్మంలో భాగస్వామ్యం కల్పించారని అన్నారు.
బీసీ కార్పొరేషన్లకు 672 మంది డైరక్టర్ల నియామకం - ap latest news
మంత్రి వేణుగోపాల కృష్ణ బీసీ కార్పొరేషన్ల డైరక్టర్ల జాబితాను విడుదల చేశారు. మొత్తం 672 పేర్లు ప్రకటించగా అందులో 339 మంది మహిళలకు చోటు కల్పించారు. వైకాపా హయాంలోనే బీసీలకు న్యాయం జరుగుతోందని పలువురు మంత్రులు తెలిపారు.

బీసీ కార్పొరేషన్లకు 672 మంది డైరక్టర్ల నియామకం
వెనకబడిన వర్గాల కోసం వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి అప్పలరాజు అన్నారు. వైకాపా సర్కారు వల్లే బీసీలకు తగిన న్యాయం జరుగుతోందని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నియోజకవర్గాల వారీగా ఇసుక ధర: సీఎం జగన్
TAGGED:
minister venugopala krishna