Corona cases: రాష్ట్రంలో కొత్తగా 517 కరోనా కేసులు.. 8 మరణాలు - ఏపీలో కరోనా కేసులు
16:18 October 13
రాష్ట్రంలో ప్రస్తుతం 6,615 కరోనా యాక్టివ్ కేసులు
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 38,786 పరీక్షలు నిర్వహించగా.. 517 కేసులు నిర్ధారణ అయ్యాయి(ap corona cases news). తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,58,582 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల ఎనిమిది మంది చనిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,276కి చేరింది. 24 గంటల వ్యవధిలో 826 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,615 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,88,39,595 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
ఇదీ చదవండి
new cj of ap high court: హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ ప్రమాణ స్వీకారం