ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 506 కరోనా కేసులు..ఐదుగురు మృతి - AP CORONA CASES NEWS

రాష్ట్రంలో కొత్తగా 506 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మెుత్తం బాధితుల సంఖ్య 8,75,531కి చేరింది. వైరస్ బారిన పడి ఐదుగురు మృతి చెందారు.

రాష్ట్రంలో కొత్తగా 506 కరోనా కేసులు, 5 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 506 కరోనా కేసులు, 5 మరణాలు

By

Published : Dec 13, 2020, 5:28 PM IST

రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 63,873 కరోనా పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 506 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి మెుత్తం బాధితుల సంఖ్య 8,75,531కి చేరింది. కృష్ణా, గుంటూరు, చిత్తూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 7,057కు చేరింది. వైరస్ బారిన పడిన మరో 613 మంది కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 8.63 లక్షల మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 4,966 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాల వారీగా కొత్త కేసులు

కృష్ణాలో 59, తూర్పుగోదావరి జిల్లా 41, నెల్లూరులో 29, కర్నూలులో 28, శ్రీకాకుళంలో 25, విశాఖలో 23, ప్రకాశంలో 20, అనంతపురంలో 11, విజయనగరంలో 13, కడపలో 12 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇవీ చదవండి

పాముకు గాయం.. ఆస్పత్రిలో చికిత్స

ABOUT THE AUTHOR

...view details