ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జన్​ధన్​ డబ్బులు.. ధనా ధన్​ పోయాయి​ - talangana cm kcr

లాక్​డౌన్​ కారణంగా పేదలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జన్​ధన్​ ఖాతాల్లో రూ.500 జమచేసింది. ఈ డబ్బుల కోసం బ్యాంకుల వద్ద బారులు తీరొద్దని.. తర్వాతైనా తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ క్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్​ ఖాతాల్లో నుంచి రూ.500 మొత్తం తిరిగి వెనక్కి వెళ్లిపోవడం ఖాతాదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

janadhan accounts
తెలంగాణలో వెనక్కి పోతున్న జన్​ధన్​ డబ్బులు

By

Published : Apr 28, 2020, 1:38 PM IST

తెలంగాణలో వెనక్కి పోతున్న జన్​ధన్​ డబ్బులు

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్​ యోజన రిలీఫ్‌ ప్యాకేజి-2020 కింద జన్​ధన్‌ ఖాతాల్లో కేంద్రం జమచేసిన రూ.500 కొన్ని బ్యాంకుల ఖాతాల్లో నుంచి తిరిగి వెనక్కిపోతున్నాయి. ఫలితంగా జమ అయిన మొత్తాలను ఇంకా తీసుకోని ఖాతాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

లాక్​డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బంది పడుతున్న పేదల కోసం కేంద్రం జన్​ధన్‌ ఖాతాల్లో 3 నెలల పాటు రూ.500 లెక్కన జమచేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని జన్​ధన్‌ ఖాతాల్లో ఈనెల మొదటి వారంలో రూ.500 లెక్కన జమైంది. ఆ డబ్బును డ్రా చేసుకోడానికి బ్యాంకుల వద్ద ఖాతాదారులు బారులు తీరారు.

ఈ నేపథ్యంలో ఖాతాల్లో పడిన మొత్తం తిరిగి వెనక్కి వెళ్లదని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి ఈటల రాజేందర్​లు మీడియా సమావేశాల్లో స్పష్టం చేశారు. ఫలితంగా చాలా మంది ఖాతాదారులు తమ డబ్బులను ఖాతాల్లోనే ఉంచారు.

ఈ క్రమంలో జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం బండలింగాపూర్‌కు చెందిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులకు చెందిన కొందరి ఖాతాల్లో నుంచి రూ.500 వెనక్కి వెళ్లాయి. ఫలితంగా ఖాతాదారులు బ్యాంకు అధికారులను నిలదీశారు. తమకేమి సంబంధం లేదని.. అది ప్రధాన కార్యాలయం వారు చూస్తారని తెలిపారు.

ఇదే విషయాన్ని "ఈటీవీ భారత్" ఆ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా వెనక్కి వెళ్లిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే 2014 ఆగస్టు ఒకటో తేదీకి ముందు తెరచిన బ్యాంకు ఖాతాల్లో పీఎంజీకేవై కింద జమైన మొత్తాలు తిరిగి వెళ్లినట్లు వారు వివరించారు.

జన్​ధన్‌ ఖాతాల్లో జమైన మొత్తం తిరిగి వెళ్లడానికి అవకాశం లేదని.. తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఖాతాల నుంచి ఎందుకు వెనక్కి వెళ్లిందో వివరాలు తెలియాల్సి ఉందని బ్యాంకు అధికారుల అసోసియేసిన్‌ అధ్యక్షులు నగేశ్‌ తెలిపారు.

ఇదీ చూడండి:-

జనరేటర్​ ద్వారా ఇంట్లోకి విషవాయువు-వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details