ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కువైట్ నుంచి వచ్చిన వారిలో 56 మందికి కరోనా - latest corona news krishna district

కువైట్ నుంచి భారత్​కు వచ్చిన 144 మందిలో56 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరందరిని నూజివీడు ట్రీపుల్ ఐటీ క్వారంటైన్​లో ఉంచగా, ప్రత్యేక వాహనాల ద్వారా వారిని విజయవాడ తరలిస్తున్నట్లు మండల తహసీల్దార్ ఎం. సురేశ్ తెలిపారు.

56of those from Kuwait are Corona
నూజివీడులోని ఐఐఐటీ క్వారంటైన్ కేంద్రం

By

Published : May 25, 2020, 12:00 AM IST

కువైట్ నుంచి విజయవాడకు వచ్చి నూజివీడు ట్రిపుల్ ఐటీ క్వారంటైన్‌లో ఉన్న 144 మందిలో 56 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో ప్రత్యేక వాహనాలలో వారిని విజయవాడ తరలిస్తున్నట్లు మండల తహసీల్దార్ ఎం. సురేష్ కుమార్ తెలిపారు. వీరిని ఈనెల 21వ తేదీన నూజివీడు ట్రిపుల్ ఐటీకి తీసుకువచ్చినట్లు చెప్పారు.

వీరికి సమయానికి అల్పాహారము, భోజనము ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రెవెన్యూ శాఖ, వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారని చెప్పారు. రైతులు, ప్రజలు ఏ విధమైన సమస్యలు ఉన్నప్పటికీ కార్యాలయానికి రాకుండా, ఫోను ద్వారా కానీ, ఆన్లైన్ విధానంలో కానీ సమస్యలను పరిష్కరించుకునే విధంగా ముందడుగు వేయాలని సూచించారు.

ఇదీ చదవండి:ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రాంగణం సీజ్​ చేయండి

ABOUT THE AUTHOR

...view details