కృష్ణా జిల్లా గుడివాడలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని తరలిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించామని డీఎస్పీ సత్యానందం తెలిపారు. ముగ్గురిని అరెస్టు చేసి.. 40కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన భాస్కరరావు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన జయ చంద్ర కుమార్ అని వివరించారు. ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
గుడివాడలో 40 కేజీల గంజాయి స్వాధీనం - krishna distrct
కృష్ణా జిల్లా గుడివాడలో అక్రమంగా తరలిస్తున్న 40కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు.
గుడివాడలో 40కేజీల గంజాయి స్వాధీనం