ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్రేన్​లో 350 కేజీల గంజాయి తరలింపు... ఇద్దరి అరెస్ట్ - 350 Kgs of Huge Cannabis in Kanchikarla

గుట్టు చప్పడు కాకుండా తరలిస్తున్న గంజాయిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు సరకు రవాణా కోసం క్రేన్​ను వినియోగించడంతో అధికారులు విస్తుబోయారు.

పోలీసుల చాకచక్యం.. 350 కేజీల భారీ గంజాయి సీజ్.. ఇద్దరి అరెస్ట్
పోలీసుల చాకచక్యం.. 350 కేజీల భారీ గంజాయి సీజ్.. ఇద్దరి అరెస్ట్

By

Published : May 11, 2021, 1:51 PM IST

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర వద్ద క్రేన్​లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కి గుట్టు చప్పుడు కాకుండా రవాణా చేస్తున్నట్లు గుర్తించిన ప్రత్యేక విభాగం సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

150 బాక్సుల్లో..

అనంతరం నిందితులను అరెస్ట్ చేసి సుమారు 150 బాక్సుల్లోని 350 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చూడండి :ఏ అధికారంతో అంబులెన్సులను ఆపారు: తెలంగాణ హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details