ap corona cases today: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 19,241 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 335 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ సోకి కృష్ణా, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కరోనా బారి నుంచి తాజాగా 936 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,754 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది.
దేశంలోనూ తగ్గుముఖం..
India covid cases: మరోవైపు దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య 20 వేల లోపునకు పడిపోయింది. కొత్తగా 19,968 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 673 మంది మరణించారు. 48,847 మంది కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 4,28,22,473
- మొత్తం మరణాలు: 5,11,903
- యాక్టివ్ కేసులు: 2,24,187
- మొత్తం కోలుకున్నవారు: 4,20,86,383
Vaccination in India:దేశంలో వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. శనివారం మరో 30,81,336 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,75,37,22,697కు చేరింది.