అక్టోబర్‌లో 30 నైపుణ్య కళాశాలలు ప్రారంభిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. సీఎం జగన్ చేతుల మీదుగా కడప, ఒంగోలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో నైపుణ్య కళాశాలల ప్రారంభిస్తామని తెలిపారు.
30 కళాశాలల పర్యవేక్షణకు ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. శనివారం నైపుణ్యాభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన మంత్రి... అన్ని కళాశాలల లేఔట్లకు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు రాకుండా కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) నిధుల సమీకరణపై మరింత దృష్టి సారించాలని అధికారులను సూచించారు. ఉద్యోగ అవకాశాలు ఉండే 20 కోర్సులపై అధ్యయనం చేయాలని ఆదేశించారు.