జగ్గయ్యపేట ఉన్నత పాఠశాలలో 200 సైకిళ్లు పంపిణీ - 200 cycles
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ఉచిత సైకిళ్లు పంపిణీ చేసింది. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పాల్గొన్నారు.
జగ్గయ్యపేట ఉన్నత పాఠశాలలో 200 ఉచిత సైకిళ్లు పంపిణీ
జగ్గయ్యపేట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 200 మంది బాలికలకు ప్రభుత్వం ఉచితంగా సైకిళ్లు పంపిణి చేసింది. శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో విద్యారంగానికి పెద్దపీట వేశారని సామినేని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.