ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మత్స్యకారుల విడుదలకు సీఎం జగనే కారణం' - రాష్ట్రానికి వచ్చిన 20 మంది మత్స్యకారులు .

రాష్ట్రానికి 20 మంది మత్స్యకారులు రావడం పట్ల మంత్రి మోపిదేవి వెంకటరమణ హర్షం వ్యక్తం చేశారు. సీఎం ప్రత్యేక శ్రద్ద వల్లే మత్స్యకారులు విడుదలయ్యారని తెలిపారు.

20 fishermen  came to state
మత్స్యకారుల రాకపై మంత్రి మోపిదేవి వ్యాఖ్యలు

By

Published : Jan 8, 2020, 1:30 PM IST

మత్స్యకారుల రాకపై మంత్రి మోపిదేవి వ్యాఖ్యలు

పాక్​చెరలో ఉన్న 22 మంది మత్స్యకారులలో... 20 మంది రాష్ట్రానికి వచ్చారని, మరో ఇద్దరు త్వరలో విడుదలవుతారని మంత్రి మోపిదేవి వెల్లడించారు. 6 నెలలుగా కేంద్రంతో సీఎం నిరంతరం సంప్రదింపులు జరపడంతోనే ఇది సాధ్యమైందన్నారు. సరైన ఫిషింగ్ హార్బర్ లేక ఇబ్బంది పడుతున్నామని మత్స్యకారులు తెలిపారని గుర్తుచేశారు. అందుకు అనుగుణంగా శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్లను నిర్మించాలని సీఎంను కోరామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆ జిల్లాలో జెట్టీలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారన్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించి 400 మంది పాక్‌ జైళ్లలో ఇప్పటికీ మగ్గుతున్నారని... సీఎం ప్రత్యేక శ్రద్ద వల్లే 22 మంది మత్స్యకారులు విడుదలయ్యారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మత్స్యకారులకు జీవనోపాధి పెంచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details