స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. కృష్ణా జిల్లా వత్సవాయిలో చేపట్టిన వాహన తనిఖీల్లో సరైన పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ. 18 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణకు చెందిన జక్కుల వెంకట్రెడ్డి అనే వ్యక్తి కారులో ఆ డబ్బును తరలిస్తున్నాడు. డబ్బుకు సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవంతో నగదును రెవెన్యూ అధికారులకు అందజేశారు. మరో వ్యక్తి నుంచి ఐదువేల విలువచేసే 10 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేశారు.
తనిఖీల్లో రూ.18 లక్షల నగదు పట్టివేత - కృష్ణాలో నగదు పట్టివేత
కృష్ణా జిల్లా వత్సవాయిలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో రూ.18లక్షలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు చూపక పోనడంతో ఆ నగదుని స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అందజేశారు.
18 లక్షల నగదు పట్టివేత