కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కృష్ణా జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఆదివారం నుంచి మార్చి 31 వరకు 144 సెక్షన్ విధిస్తూ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో నలుగురైదుగురు ఎక్కడ గుమిగూడరాదని ఆదేశించారు. ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో హెచ్చరించారు.
ఇకపై గుమిగూడితే చట్టపరమైన చర్యలు తప్పవు..! - కృష్ణా జిల్లాలో 144 సెక్షన్
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. మార్చి 31 వరకు జిల్లాలో 144 సెక్షన్ విధించారు. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు.

144 section in krishna district