ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పద మూడో రోజుకు చేరుకున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - eenadu cricket league in vijayawada news

ఈనాడు ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు పదమూడో రోజుకు చేరుకున్నాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో నెగ్గిన జట్లు ఫైనల్స్​కు చేరుకున్నాయి.

13th day eenadu cricket league in vijayawada
పదమూడో రోజుకు చేరుకున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్

By

Published : Dec 28, 2019, 8:00 PM IST

పదమూడో రోజుకు చేరుకున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్
విజయవాడ గూడవల్లిలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ పదమూడో రోజుకు చేరుకున్నాయి. జూనియర్, సీనియర్ విభాగాల్లో 4 జట్లు తలపడ్డాయి. మెుదట జూనియర్ మ్యాచ్​లో విశ్వశాంతి జూనియర్ కళాశాల, ఆంధ్ర లయోలా జూనియర్ కళాశాల జట్లు తలపడ్డాయి. ఒక్క పరుగు తేడాతో విశ్వశాంతి జూనియర్ కళాశాల విజయం సాధించింది. మెుదట సీనియర్ విభాగంలో పీబీ సిద్ధార్ధ డిగ్రీ, లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల జట్లు పోటీ పడగా, సిద్ధార్ధ కళాశాలను విజయం వరించింది. రెండో జూనియర్ మ్యాచ్​లో కేబీఎన్ జూనియర్ కళాశాల, సిద్ధార్ధ కళాశాల జట్లు పోటీ పడ్డాయి. 9 వికెట్ల తేడాతో సిద్ధార్ధ గెలుపొందింది. రెండో సీనియర్ మ్యాచ్​లో నలంద డిగ్రీ, ఎమ్​వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల జట్లు తలపడగా, నలందా డిగ్రీ కళాశాల 44 పరుగుల తేడాతో గెలుపొందింది. విజయం సాధించిన 2 జట్లు పైనల్స్​కు చేరుకున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details