ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూజివీడులో 12 పాజిటివ్ కేసులు నమోదు - nuzveedu corona cases latest news

నూజివీడులో తాజాగా మరో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన అధికారులు కేసులు నమోదైన అజరయ్య పేట, ఎంప్లాయిస్ కాలనీలను కంటైన్​మెంట్​ జోన్లుగా ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.

నూజివీడులో 12 పాజిటివ్ కేసులు నమోదు
నూజివీడులో 12 పాజిటివ్ కేసులు నమోదు

By

Published : Jun 19, 2020, 10:08 PM IST

నూజివీడు పట్టణంలో ఇవాళ మరో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో అజరయ్యపేటలో 9, ఎంప్లాయిస్​ కాలనీలో 2, కుమ్మరి పేటలో ఒకటి పాజిటివ్​ వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అజరయ్య పేట నుంచి 500 మీటర్ల వరకూ... ఎంప్లాయిస్ కాలనీ నుంచి 200 మీటర్ల వరకు కంటైన్మెంట్ జోన్​లుగా అధికారులు ప్రకటింటారు. ఈ జోన్​ పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. వారికి కావలసిన కాయగూరలు, నిత్యావసర వస్తువులు ఇళ్లవద్దకే వస్తాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వారికి జరిమానా విధించడం జరుగుతుందని డీఎస్పీ బి.శ్రీనివాస్ తెలిపారు.

ఇదీ చూడండి:అయినవిల్లి మండలంలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details